Follow

Tuesday, September 8, 2015

Thursday, September 3, 2015

అరబిక్ ఐశ్వర్య



ఇటీవలికాలంలో భాషా భేదాలకు అతీతంగా కథానాయికలు తమ ప్రతిభను చాటుతున్నారు. పాటలు, పోరాటలు, గాత్రధారణ...ఇలా తమ అభిరుచికనుగుణంగా భిన్న విభాగాల్లో రాణిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో ఐశ్వర్యరాయ్ చేరిపోయింది. ఆమె పునరాగమనం చేస్తోన్న చిత్రం జబ్బా. మహిళా ప్రధాన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో ఈ సుందరి న్యాయవాది పాత్రలో కనిపించనుంది. ఓ కేసును వాదించే క్రమంలో నిజాయితీపరురాలైన ఓ న్యాయవాదికి ఎదురైన సంఘటనలతో దర్శకుడు సంజయ్‌గుప్తా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని అరబిక్ భాషలో కూడా విడుదల చేస్తున్నారు. ఈ భాషలోకి అనువాదమవుతోన్న తొలి బాలీవుడ్‌లో చిత్రమిదే కావడం విశేషం. ఈ సినిమాకోసం అరబిక్ భాషలో ఐశ్వర్యరాయ్ పాత్రకు ఇతరులతో డబ్బింగ్ చెప్పించాలని అనుకున్నారు. అరువు గొంతుపై ఆధారపడటానికి ఇష్టపడని ఐశ్వర్యరాయ్ అరబిక్‌లో కూడా తానే స్వయంగా డబ్బింగ్ చెప్పాలని నిర్ణయించుకుందట.

అక్టోబర్ 9న రుద్రమదేవి..

 
అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం రుద్రమదేవి. గుణా టీమ్‌వర్క్స్ పతాకంపై గుణశేఖర్ స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్నారు. అక్టోబర్ 9న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గుణశేఖర్ మాట్లాడుతూ కాకతీయ మహాసామ్రాజ్య వైభవాన్ని, రుద్రమదేవి పోరాటపటిమను, పాలనా చాతుర్యాన్ని, 13 శతాబ్ధం నాటి సాంఘిక పరిస్థితుల్ని కళ్లకు కట్టినట్లుగా ఆవిష్కరించే చిత్రమిది. సాంకేతిక పనులు పూర్తి చేయడం ఆలస్యమవడంతో విడుదల తేదీని అక్టోబర్9కి మార్చడం జరిగింది.

పూరి జగన్నాథ్ కు దాసరి పంచ్లు

 
దర్శకరత్న దాసరి నారాయణరావు స్టైలే వేరు. ఆయన మనస్సులో ఉన్నది ఉన్నట్టు కుంటబద్దలు కొట్టేస్తారు. దాసరి ఇప్పటి వరకు టాప్ హీరోల పై ముఖ్యంగా మెగా కుటుంబం పై పలు ఫంక్షన్లలో సెటైర్లు వేయడం చూశాం. అయితే ఆయన తన రూటు మార్చి ఈ సారి ఎందుకో గాని పూరి జగన్నాథ్ ను టార్గెట్ గా చేసుకుని భారీ పంచ్ లు విసిరారు. ఇటీవల సంపూర్ణేష్ బాబు హీరోగా నటించే.. 'కొబ్బరి మట్ట' షూటింగ్ ప్రారంభోత్సవం సందర్భంగా దాసరి ఈ కాంట్రవర్సీ కామెంట్లు చేశారు.

సినిమాలో ఒకప్పుడు హీరో అంటే మంచివాడు... తల్లిదండ్రులను గౌరవించేవాడు... ఊరికి మంచి చేసేవాడు అన్న పంథాలో హీరో క్యారెక్టర్ ఉండేదని... ఏ ముహూర్తాన పూరి జగన్నాథ్ 'ఇడియట్' సినిమా తీశాడోగానీ అప్పటి నుంచి హీరోకి అర్థం మారి పోయిందన్నారు దాసరి. తల్లిదండ్రుల గురించి వెటకారంగా మాట్లాడేవాడు లవర్ ని రోడ్డుపై ఏడిపించేవాడు సెటైర్లతో పంచ్ డైలాగ్స్ వేసేవాడు ఈ రోజు హీరోగా మారిపోవడం దురదృష్టకరమని దాసరి విమర్శించారు.

చెర్రీ నెక్ట్స్ సినిమా గౌతమ్ మీనన్తోనే !


పరిశ్రమలో శరవేగంగా సమీకరణలు మారిపోతుంటాయి. ఈ రోజు తీసుకొన్న నిర్ణయం రేపటి వరకు కంటిన్యూ అవుతుందో లేదో తెలియదు. జయాపజయాలు అవకాశాల్ని తారుమారు చేస్తుంటాయి. నిన్నటిదాకా అనుకొన్న కాంబినేషన్ రేపు ఉండకపోవచ్చు. అసలు ఊహించని రీతిలో కొత్త కాంబినేషన్లు సెట్టవ్వొచ్చు. అందుకే ఇది చిత్ర ప్రపంచమైంది. పరిశ్రమని దగ్గర్నుంచి చూస్తున్న ప్రతి ఒక్కరికీ ఇవన్నీ అనుభవమే. మొన్నటికి మొన్న సురేందర్రెడ్డి 'రేసుగుర్రం' తో అల్లు అర్జున్ కి హిట్టిచ్చేసరికి యువ కథానాయకుల చూపంతా ఆయనపై పడింది. అలాంటి దర్శకుడితో సినిమా చేయాల్సిందే అన్న అభిప్రాయాలు చాలా మంది యువ కథానాయకుల నుంచి వినిపించాయి. రామ్చరణ్ కూడా సురేందర్రెడ్డి తో సినిమా చేయాల్సిందే అని డిసైడైయ్యాడు. కథ కూడా రెడీ చేసుకోమని చెప్పాడు. అయితే ఇంతలో ఆయనకి 'కిక్2' రూపంలో ఫెయిల్యూర్ వచ్చింది. ఇప్పుడు ఆ కాంబినేషన్ గురించి ఇండస్ట్రీ అంతా సందేహం వ్యక్తం చేస్తోంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో సూరీతో సినిమా చేయడేమో అని అంటున్నారు . మరోపక్క చరణ్తో సినిమా చేయాలని తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ ఉవ్విళ్లూరుతున్నాడు. చెర్రీ  ఛాన్స్ ఇవ్వాలి కానీ ఆయనతో లవ్ యాక్షన్ మిక్సయిన ఓ సినిమాని తీస్తానని చెబుతున్నాడు. చెర్రీ కూడా ఇప్పటికే గౌతమ్మీనన్ చెప్పిన కథ విని పచ్చజెండా ఊపేసినట్టు తాజాగా టాలీవుడ్ వర్గాలు మాట్లాడుకొంటున్నాయి. ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో 'బ్రూస్ లీ' చేస్తున్నాడు చరణ్. ఈ సినిమా మరో నెల రోజుల్లో పూర్తవుతుంది.

60 కోట్ల బడ్జెట్ 154 కోట్ల వసూళ్లు !



తెలుగు సినిమా వంద కోట్ల క్లబ్‌లో చేరడం సాధ్యమేనా అనుకుంటున్న తరుణంలో బాహుబలి ఐదువందల కోట్ల మార్కును దాటి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా బాటలోనే మహేష్ నటించిన శ్రీమంతుడు చిత్రం 60కోట్ల బడ్జెట్‌తో నిర్మాణం జరుపుకొని 25 రోజులకే 154 కోట్లు వసూలు చేసి ట్రేడ్ వర్గాల్ని ఆశ్చర్యపరిచింది. తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో బాహుబలి తరువాత స్థానాన్ని శ్రీమంతుడు దక్కించుకోవడం విశేషం. ఈ సందర్భంగా హీరో మహేష్‌బాబు మాట్లాడుతూ శ్రీమంతుడు నా కెరీర్‌లో బెస్ట్ ఫిలిమ్‌గా నిలిచింది.

ఈ సినిమా విజయం పట్ల నా అభిమానులు చాలా ఆనందంగా వున్నారు. వారి కళ్లల్లో ఆనందాన్ని చూస్తుంటే చాలా సంతృప్తిగా వుంది. శ్రీమంతుడు లాంటి మరిన్ని మంచి చిత్రాలు చేయడానికి ఈ విజయం నాకు మంచి స్ఫూర్తినిచ్చింది. దర్శకుడు కొరటాల శివ అద్భుతమైన కథనిచ్చారు. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా చిత్రాన్ని నిర్మించారు. అందరి కృషితో మంచి విజయం దక్కింది అన్నారు. 25 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 154 కోట్ల గ్రాస్‌ను 95 కోట్ల 32 లక్షల 42 వేల 733 రూపాయల షేర్‌ను సాధించిందని, కేవలం తెలంగాణలోనే 21కోట్ల 5లక్షల 59వేల 99రూపాయల షేర్‌ను వసూలు చేసి నైజాంలో మహేష్‌బాబు స్టామినా ఏమిటో మరోసారి రుజువు చేసిందని, శ్రీమంతుడు చిత్రం బాహుబలి తరువాత తెలుగు చిత్రపరిశ్రమలో నెంబర్ టూ స్థానాన్ని దక్కించుకుందని ఈ రోస్ ఇంటర్నేషనల్ సంస్థ తెలిపింది.

Popular Posts

Recent Posts

Entertainment

Unordered List

Entertainment

Text Widget

Powered by Blogger.
Entertainment

Racing

Entertainment

Travel

Cute

My Place

Recent Post

Entertainment

Videos

Entertainment

Entertainment

Entertainment

Subscribe

Ads

Entertainment
Entertainment